‘నేతన్న సేవ’ కింద ఒక్కో నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం: మంత్రి జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - Sep 13 , 2026 | 01:16 PM
‘నేతన్న సేవ’ కింద ఒక్కో నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయాన్ని తమ ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
నంద్యాల జిల్లా, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ‘నేతన్న సేవ’ కింద ఒక్కో నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయాన్ని తమ ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని పలుకూరు చేనేత కార్మికులు ఈరోజు (ఆదివారం) కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న సేవలో’ కార్యక్రమంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డికి నేతన్నలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘నేతన్న సేవ’తో 51,952 మంది నేతన్నలకు లబ్ధిచేకూరుతుందని వెల్లడించారు. 85,678 మంది 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు నెలకు రూ.4 వేల ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ అందజేస్తున్నట్లు ప్రకటించారు. 51,952 మంది నేతన్నలకు ఉచిత విద్యుత్‌లో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు
క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా
ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News