Share News

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:36 PM

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు.

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan).. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు. ఏఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. వాగులు పొంగుతున్న వేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.


అవసరం ఉన్న చోట తక్షణం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ అప్రమత్తం చేశారు. గంగవరం సమీపంలో ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయిందని చెప్పుకొచ్చారు. సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అవసరం ఉన్న చోట తక్షణమే పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అలర్ట్ చేశారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహారించాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 06:16 PM