Share News

పెండింగ్‌ భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:24 PM

22A జాబితాలో 232 అంశాలు పరిష్కరించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రూ.5 వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని.. దీని ద్వారా లక్షలాది మందికి లబ్ధ కలిగిందని వ్యాఖ్యానించారు.

పెండింగ్‌ భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): 22A జాబితాలో 232 అంశాలను పరిష్కరించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. రూ.5 వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని.. దీని ద్వారా లక్షలాదిమందికి లబ్ధి కలిగిందని వ్యాఖ్యానించారు. పెండింగ్‌ భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈరోజు (శుక్రవారం) కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. భూ సమస్యల పరిష్కారంలో అవినీతికి తావివ్వొద్దని నిర్దేశించారు. బ్యాక్‌లాగ్‌ భూ వివరాలను 45 రోజుల్లో నమోదు చేయాలని సూచించారు.


భూ వివరాలను బ్లాక్‌ చెయిన్‌లో ఉంచాలి..

భూ వివరాలను బ్లాక్‌ చెయిన్‌లో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లోని భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం... ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. మంత్రులు, అధికారులు కూడా ఈ సమస్యలను పరిష్కరించిన విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అంబాజీపేటలో గ్రౌండ్ రెంట్ భూముల అంశం 120 ఏళ్ల కాలం నాటి సమస్య అని.. అలాంటి సమస్యను పరిష్కరించామని స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలను ప్రజలకు పూర్తిస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరించాలని ఆదేశించారు. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ వ్యవహారాల్లో ఎక్కడా అవినీతి లేకుండా భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియ పూర్తైన భూములకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి రియల్ టైమ్‌లో ఇంటిగ్రేషన్ చేయాలని ఆదేశించారు. 45 రోజుల్లో బ్యాక్ లాగ్‌లోని భూ వివరాలను బ్లాక్ చెయిన్‌లో పెట్టాలని మార్గనిర్దేశం చేశారు.


లంచం పేరుతో ఆరోపణలు వస్తే ఊరుకునేది లేదు..

రైల్వేకోడూరులో 10500 పట్టాల్యాండ్స్‌ను వెడ్ ల్యాండ్ ఎంట్రీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ డికెటి పట్టాగా ఎక్కించారని సీఎం చంద్రబాబు తెలిపారు. నాటినుంచి వారికి లోన్లు రావడం లేదని... ఇబ్బంది పడ్డారని సీఎం చెప్పారు. అయితే ఆ సమస్యలను సరిచేస్తున్నామని అధికారులు వివరించారు. ఇలాంటి వాటి విషయంలో అధికారులు స్పందిస్తే గుడ్ విల్ వస్తుందని సీఎం పేర్కొన్నారు. అనంతపురంలో బంజరు ల్యాండ్ పేరుతో 9997 ఎకరాలు భూమి ఉందని.. ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటే 4352 మంది దీని వల్ల లబ్ధి పొందుతారని అధికారులు చెప్పారు. ఇలాంటి వాటి విషయంలో ఓ కార్యాచరణ రూపొందించి వెంటనే వీటిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి స్థలాల పంపిణీ విషయంలో సంబంధిత మంత్రి వెళ్లి సమావేశాలు పెట్టాలని.. ఆ తర్వాత పట్టాలను ఇవ్వాలని సూచించారు.


అలా చేస్తే అవినీతికి ఆస్కారం ఉండదు..

ఇలాంటి సభలు పెట్టి ఇంటి పట్టాలను పంపిణీ చేస్తే ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి వాటి విషయంలో లంచం పేరుతో ఆరోపణలు వస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఈ నిర్ణయాలను అమలు చేసేటప్పుడు చిత్తశుద్దిగా ఉండాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఇలాంటి భూ సమస్యలను పరిష్కరించాలని నిర్దేశించారు. అప్పుడే ప్రజల్లోకి పాజిటివ్ మెసేజ్ వెళ్తుందని చెప్పారు. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్‌లో ఇలాంటి సమస్యలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. వెంటనే వాటిని గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని.. అప్పుడు మీరు మీ జిల్లా ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు.


నెల్లూరులో 2600 ఇళ్ల పట్టాలను ఇప్పటికే ఇచ్చాం: మంత్రి నారాయణ

నెల్లూరు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్‌ ఫైలును అధికారి పీయూశ్ కుమార్ ఒక నిమిషంలోనే పరిష్కరించారని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరులో 6000 ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారని... 2600 పట్టాలు ఇప్పటికే ఇచ్చామని స్పష్టం చేశారు. వచ్చే నెల రోజుల్లో మిగిలిన వారికి కూడా పట్టాలు పంపిణీ చేస్తామని నెల్లూరు కలెక్టర్ వివరించారు. ఈ సందర్బంగా ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి శశిభూషన్ కలుగజేసుకున్నారు. ఈ సమస్యపై శశిభూషన్ మాట్లాడిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అని ముఖ్యమంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించారు. శశిభూషన్ నిజాయితీగా ఉన్నారంటూ కితాబిచ్చారు. 2014- 19 మధ్యకాలంలో వాటర్ రిసోర్స్ సెక్రటరీగా శశిభూషన్ ఉన్నప్పుడు ఒక్క విషయంలో కూడా ఎన్‌వోసీ ఇవ్వలేదని సీఎస్ తెలిపారు. ఈసారి ఆయన తెలివిగా వ్యవహారిస్తున్నారని సీఎస్ చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రజలను హింసించడం మానేశారని నవ్వుతూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: అయ్యన్నపాత్రుడు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 06:20 PM