జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: అయ్యన్నపాత్రుడు
ABN , Publish Date - Sep 09 , 2026 | 08:00 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు.
అనకాపల్లి, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker Ayyanna Patrudu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. ఈరోజు (బుధవారం) అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో 'జయహో బీసీ' సభ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్యర్యంలో 'జయహో బీసీ' బహిరంగ సభ జరిగింది. ఈ సభకు స్పీకర్ అయ్యన్న, ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. టీడీపీకి ఏపీ అధ్యక్షుడిగా చేసే అదృష్టం బీసీ నాయకుడు పల్లా శ్రీనివాసరావుకు దక్కిందని పేర్కొన్నారు. ఆయనకు అసెంబ్లీకి రావడానికి భయమెంటని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ ఏపీని దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు. 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు బాగా చులకన అయిపోయాయని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచాను..
‘దివంగత మాజీ సీఎం నందమూరి రామారావు.. నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు నన్ను పిలిచి ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇప్పటికీ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను. ప్రజలు ఇచ్చిన గౌరవమే మాకు ఆశీర్వాదం. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది. బీసీలకు వచ్చిన అధికారాన్ని కాపాడుకోవాలి. గ్రామీణ అభివృద్ధిలో టీడీపీ స్వర్ణ కాంతులు తెస్తోంది. సీఎం చంద్రబాబు అనేక ఉద్యోగాలను భర్తీ చేశారు. చంద్రబాబు మెగా డీఎస్సీ ప్రకటించారు. ఈ డీఎస్సీపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు పోలవరం కల సహకారం చేశారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తీసువచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ సీఎం చంద్రబాబు కల్పించారు’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News