Share News

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Sep 08 , 2026 | 03:37 PM

తమ పార్టీ నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని... ఈ విషయంపై సీరియస్‌గా ఉండాలని ఆదేశించారు.

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని... ఈ విషయంపై సీరియస్‌గా ఉండాలని ఆదేశించారు. ఈరోజు (మంగళవారం) మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు లీడర్ షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై లోకేశ్ మాట్లాడారు. ఎంతమంది నాయకులు సోషల్ మీడియాను యాక్టివ్‌గా వినియోగిస్తున్నారని అడిగారు.


డీఎస్పీపై సెల్ఫీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశా..

ఏఎంసీ, కార్పొరేషన్ చైర్మన్లు కూడా తాము చేసిన పనులను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, ఓపెన్‌గా మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా సోషల్ మీడియా ద్వారా సెల్ఫీ వీడియోలతో తన సందేశాన్ని తెలియజేస్తున్నారని అన్నారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశానని, డీఎస్సీపై దుష్ప్రచారంపై సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని తెలిపారు.


ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి..

ఈ విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని లోకేశ్ సూచించారు. వైసీపీ పని ఎప్పుడూ తమ ప్రభుత్వంపై బురదజల్లడమేనని విమర్శించారు. జగన్ అండ్ కో దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ ఎప్పటికప్పుడు స్పందించాలని మార్గనిర్దేశం చేశారు. జగన్ మావిగన్ అంటే వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తాము అభివృద్ధి చేస్తున్నామని... మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు

గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్

పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 04:34 PM