Share News

పార్టీ ఇచ్చిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:59 PM

పార్టీయే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ పదవుల్లో ఉన్న వారిని మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందేనని ఆదేశించారు.

పార్టీ ఇచ్చిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): పార్టీయే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) స్పష్టం చేశారు. పార్టీ పదవుల్లో ఉన్న వారిని మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందేనని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఈరోజు (సోమవారం), రేపు (మంగళవారం) శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్‌షాప్‌‌‌లో లోకేశ్ పాల్గొని ప్రసంగించారు.


ఆ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే..

పార్టీ ఏదైనా పని చెబితే.. దానికే ప్రయారిటీ ఇవ్వాలని మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు. క్వాంటం టవ‌ర్స్‌కు సంబంధించిన ఓ కార్యక్రమం ఉందని తనను ఆహ్వానిస్తే... పార్టీ తనకో పని అప్పచెప్పిందని... తాను రానని స్పష్టం చేశానని పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే... దానికే హై ప్రయారిటీ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ పదవుల్లో ఉన్న వారు.. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడానికి ఎవరి అనుమతి అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు బీ-ఫారం ఇవ్వకుంటే మంత్రులు కాలేరని, ఎమ్మెల్యేలు కారని తేల్చిచెప్పారు.


మై-టీడీపీ యాప్‌లో పార్టీ కార్యక్రమాల వివరాలను అప్‌డేట్ చేస్తున్నాం..

పార్టీని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదనే విషయాన్ని.. ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది.. నిరంతరం సమీక్షించుకుంటూ టీడీపీ కేడర్ వెళ్లాలని సూచించారు. మై-టీడీపీ యాప్‌లో పార్టీ కార్యక్రమాల వివరాలను పూర్తిగా అప్‌డేట్ చేస్తున్నామని వెల్లడించారు. ఆ సమాచారం ఆధారంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని మంత్రి నారా లోకేశ్ మార్గనిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్‌షిప్ కాంక్లేవ్

పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు

వంగవీటి రాధాను పాస్‌పోర్ట్‌ వ్యవహారంలో మోసం చేసేందుకు బ్రోకర్ యత్నం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 02:40 PM