Share News

టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్‌షిప్ కాంక్లేవ్

ABN , Publish Date - Sep 06 , 2026 | 08:02 PM

రాజకీయాల్లో కొత్త నాయకత్వ విధానానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతోంది. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రతినిధులకు నాయకత్వ పటిమ పెంపొందించే అంశంపై రెండు రోజుల ట్రైనింగ్ కాంక్లేవ్‌ను టీడీపీ నిర్వహిస్తోంది.

టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్‌షిప్ కాంక్లేవ్
TDP Leadership Conclave

అమరావతి, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో కొత్త నాయకత్వ విధానానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) శ్రీకారం చుడుతోంది. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రతినిధులకు నాయకత్వ పటిమ పెంపొందించే అంశంపై రెండు రోజుల ట్రైనింగ్ కాంక్లేవ్‌ను టీడీపీ నిర్వహిస్తోంది. ఈ నెల 7, 8వ తేదీల్లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌ను నిర్వహించనుంది. రెండు రోజుల్లో 10 సెషన్లల్లో ఈ కాంక్లేవ్ జరగనుంది. ట్రైనింగ్ - ఇంటరాక్టివ్ విధానంలో లీడర్‌షిప్ కాంక్లేవ్ నిర్వహించాలని ఆంధ్రపద్రశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశించారు. క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేలా కాంక్లేవ్ నిర్వహించేలా ఏపీ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (Nara Lokesh) ప్రణాళికలు రచించారు.


ఈ కాంక్లేవ్‌కు చంద్రబాబు, లోకేశ్ హాజరు కానున్నారు. క్షేత్రస్థాయి యంత్రాంగం, కేడర్ సమన్వయం, పొలిటికల్ రెస్పాన్స్, లీడర్‌షిప్ క్వాలిటీస్ వంటి అంశాల్లో నేతల సామర్థ్యాలను మెరుగుపరిచేలా రెండు రోజుల పాటు ట్రైనింగ్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం - ప్రజలకు వారధిగా పార్టీ నేతలు ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై కాంక్లేవ్‌లో చంద్రబాబు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం - టీడీపీ చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం... ప్రత్యర్థి పార్టీల కుట్రలను ఎండగట్టడం వంటి అంశాలపై కాంక్లేవ్‌లో కీలకంగా చర్చించనున్నారు.


ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మొదటి రోజున నాయకత్వ అభివృద్ధి, నాయకులను తీర్చిదిద్దడం, సరైన స్థానంలో నిలబెట్టడం - పార్టీ సంస్థాగత నిర్మాణం, అజెండా, పనితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం - స్వర్ణాంధ్ర విజన్ - రాజకీయ, ఆర్థిక సాధికారత - సంపూర్ణ సంక్షేమం, సాధికారత అంశాలపై చంద్రబాబు, లోకేశ్ మార్గనిర్దేశం చేయనున్నారు. రెండో రోజున సుస్థిర అభివృద్ధి, ప్రజా సేవలు, సుపరిపాలన, పొలిటికల్ కమ్యూనికేషన్ - ప్రజలకు సేవల చేరువ, ఎల్‌నినోపై అవగాహన, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత అంశాలపై చంద్రబాబు, లోకేశ్ దిశానిర్దేశం చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా గురువు చేతిలో నేనూ దెబ్బలు తిన్నాను: సీఎం చంద్రబాబు

నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను: మంత్రి లోకేశ్

గోదావరి కాలుష్యానికి కారణమైన ఏపీ పేపర్ మిల్‌‌పై ఉద్యమిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 08:24 PM