గోదావరి కాలుష్యానికి కారణమైన ఏపీ పేపర్ మిల్‌పై ఉద్యమిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
ABN , Publish Date - Sep 05 , 2026 | 02:23 PM
ఏపీ పేపర్ మిల్ యాజామాన్యం వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఈ పేపర్ మిల్ నుంచి వచ్చే కాలుష్యంపై సీరియస్ అయ్యారని పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): ఏపీ పేపర్ మిల్ యాజామాన్యం వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఈ పేపర్ మిల్ నుంచి వచ్చే కాలుష్యంపై సీరియస్ అయ్యారని పేర్కొన్నారు. పవన్ నిన్న చెప్పిన విధంగా గోదావరి కాలుష్యానికి కారణమైన ఈ పరిశ్రమపై ఉద్యమం చేయడానికి కూడా తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధిత యాజామాన్యానికి చాలా సమయం ఇచ్చామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు సహకరిస్తోంది..
ఇప్పటికీ ఈ పేపర్ మిల్ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదని మంత్రి కందుల దుర్గేశ్ ప్రశ్నించారు. రాజమండ్రి కార్పొరేషన్‌కు ఈ ఫ్యాక్టరీ పన్నులు కట్టట్లేదని, కార్మికుల పొట్టకొడుతోందని ధ్వజమెత్తారు. కడియం పేపర్ మిల్లు యాజామాన్యం కూడా 70 మందిని రోడ్డును పాడేసిందని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు సహకరిస్తోందని.. కానీ ప్రజల జీవితాలతో ఆడుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ ఫ్యాక్టరీ సరైన నిర్ణయం తీసుకోపోతే ప్రజా ఉద్యమం వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజా ఉద్యమానికి తామే నాయకత్వం వహించినా ఆశ్చర్యపోవద్దని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
ఏపీ పేపర్ మిల్‌కు నోటీసులు ఇచ్చాం: కలెక్టర్ కీర్తి చేకూరి
ఏపీ పేపర్ మిల్ కాలుష్యంపై రాజమహేంద్రవరం కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించారు. పరిశ్రమకు నోటీసులు ఇచ్చామని అన్నారు. న్యాయపరంగా ఫ్యాక్టరీపై చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఏపీ పేపర్ మిల్ రూ.17.34 కోట్ల బకాయిలు చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా
ఏపీ పేపర్ మిల్ బకాయిలపై రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడారు. ఈ పరిశ్రమ రాజమండ్రి నగరపాలక సంస్థకు రూ.17.34 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. ఈ యాజమాన్యం పన్ను బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించకుండా కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఈ పరిశ్రమపై న్యాయపరంగా చర్యలు చేపట్టిందని అన్నారు. కోర్టు స్టే పేరుతో ఈ పేపర్ మిల్ యాజమాన్యం పన్నులను పూర్తిస్థాయిలో చెల్లించడం లేదని అన్నారు. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలి: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News