Share News

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ

ABN , Publish Date - Sep 04 , 2026 | 08:09 PM

సాగునీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ సంతరించుకుంది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): సాగునీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్లతో 105 చెరువులను ఆధునికీకరిస్తున్నారు. ఈ మేరకు ఎక్స్(X)లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.


ఇప్పటికే 26 చెరువులకు పునరుజ్జీవం కల్పించారు. భూగర్భ జలాల పెంపు, సమగ్ర అభివృద్ధే ధ్యేయమని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ఆధునిక హంగులతో ఆహ్లాదకర కేంద్రాలుగా చెరువులు మారుతున్నాయని వివరించారు. వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ ఎయిర్ జిమ్‌లు, చిల్డ్రన్స్ పార్కులతో కొత్త రూపు సంతరించుకుంటున్నాయని తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా ఆయా పనులు పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 08:50 PM