Share News

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:28 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 8వ కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 10, 11వ తేదీల్లో ఈ సదస్సు జరగనుంది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
AP CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన 8వ కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 10, 11వ తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. రెండు రోజుల పాటు నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. తొలి రోజు గత సదస్సు నిర్ణయాల అమలుపై సమీక్షించనున్నారు.


రాష్ట్ర ఆర్థిక వృద్ధి, జిల్లా వారీ లక్ష్యాలపై కలెక్టర్లు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. స్వర్ణ ఆంధ్ర–2047 జిల్లా రోడ్‌మ్యాప్‌లపై ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించనున్నారు. ఆరోగ్యం, విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. పెట్టుబడులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై మాట్లాడనున్నారు. జలధార కార్యక్రమం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.


జిల్లా కలెక్టర్ల ఉత్తమ ఆవిష్కరణలకు ప్రత్యేక ప్రదర్శన, వివరణ ఇవ్వనున్నారు. రెండో రోజు ఈ-గవర్నెన్స్, RTGS, PGRS పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. భూ పరిపాలన, కేంద్ర పథకాల నిధుల వినియోగంపై చర్చించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ఓపెన్ ఫోరంలో క్షేత్రస్థాయి సమస్యలపై మాట్లాడనున్నారు. చివరి రోజు శాంతిభద్రతల సమీక్షతో పాటు ముగింపు ప్రసంగాన్ని సీఎం చంద్రబాబు చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 06:48 PM