జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలి: డీజీపీ
ABN , Publish Date - Sep 04 , 2026 | 06:09 PM
జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అకాడమీలో మెరుగైన శిక్షణ, అవసరమైన పరికరాలు అందిస్తామని తెలిపారు. ఈరోజు (శుక్రవారం) ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ –2026 ముగింపు కార్యక్రమం మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్‌లో ఓవరాల్ ఛాంపియన్‌గా విశాఖ రేంజ్ టీమ్ నిలిచింది. విజేతలకు బహుమతులను డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసు స్పోర్ట్స్ అకాడమీ లోగోను ఆవిష్కరించారు.
వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తాం..
స్పోర్ట్స్ కార్యకలాపాల కోసం వీఐటీ - అమరావతితో అవగాహన ఒప్పందం చేసుకుంది. అనంతరం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. పతకాలు రాని వారు మరింత సాధన చేయాలని సూచించారు. ర్యాంకులు, పోస్టింగ్‌లు వేరైనా అందరూ ఒకే టీమ్‌గా ఉండాలని నిర్దేశించారు. ‘మనది ఏపీ పోలీస్ టీమ్.. మనమంతా ఒకే కుటుంబం’ అని వ్యాఖ్యానించారు. శారీరక, మానసిక దృఢత్వం పోలీసులకు ఎంతో ముఖ్యమని వెల్లడించారు. మహిళా పోలీస్ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం మంచి పరిణామమని అన్నారు. వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్
గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News