Home » AP DGP
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శనివారం రాజమహేంద్రవరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు పటిష్ఠమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలు 'ఇన్వెస్టిగేషన్‌కు బ్యాక్ బోన్ లాంటివని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.
జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తొలిసారిగా పోలీసు స్పోర్ట్ మీట్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం చేసేవారు 24 గంటలూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.
వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు.
ప్రజలకు చేరువగా ఉండేందుకు హైవే పక్కన పోలీసుస్టేషన్‌లను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ సైబర్ గార్డ్ ఆపరేషనల్ ప్లాన్‌తో పాటు సైబర్ క్రైమ్ నిర్వహణ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఈరోజు (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రార్థనా స్థలాల్లో అనధికార లౌడ్‌స్పీకర్లపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి రఘురామ సోమవారం లేఖ రాశారు.