Share News

Ganesh Festival: గణేశ్​ మండపం ఏర్పాటు చేస్తున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పక చదవండి

ABN , Publish Date - Aug 20 , 2025 | 10:12 PM

రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Ganesh Festival: గణేశ్​ మండపం ఏర్పాటు చేస్తున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పక చదవండి
Ganesh Festival

అమరావతి: రానున్న వినాయక చవితి పండుగను (Ganesh Festival) దృష్టిలో పెట్టుకుని వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రూపొందించిన ganeshutsav.net వెబ్‌సైట్‌ను ఏపీ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకుని N.O.C. (నిరభ్యంతర పత్రం) పొందవచ్చని సూచించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.


DGP harish Kumar Gupta.jpg

ఆన్‌లైన్‌లో అనుమతులు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

మండప నిర్వాహకులు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ముఖ్యాధికారి మండపాలు ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న వినాయక ఉత్సవ మండపాలకు క్యూఆర్ కోడ్‌తో కూడినా N.O.C. (నిరభ్యంతర పత్రం) జారీ చేస్తారని వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే వినాయక ఉత్సవ మండపాలకు మాత్రమే ఈ అనుమతులు అవసరమని వెల్లడించారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజలు వినాయక నవరాత్రి ఉత్సవాలను సురక్షితంగా, ఆనందంగా జరపుకోవడానికి మండప నిర్వాహకులు పూర్తి పారదర్శకంగా, సులభతరంగా పోలీసు శాఖ అనుమతులు పొందేందుకు ఈ ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను అరెస్ట్

Read Latest AP News and National News

Updated Date - Aug 20 , 2025 | 10:16 PM