CM Chandrababu: వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:05 PM
రాజధానిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించటం ఓ చారిత్రాత్మక క్షణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి విలువైన సేవలు అందించిన పారిశ్రామిక వేత్త రతన్ టాటాను గౌరవించుకోవాలనే ఏపీ ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు పెట్టామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
అమరావతి,ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): రాజధానిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను (Ratan Tata Innovation Hub) ప్రారంభించటం ఓ చారిత్రాత్మక క్షణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. దేశానికి విలువైన సేవలు అందించిన పారిశ్రామిక వేత్త రతన్ టాటాను గౌరవించుకోవాలనే ఏపీ ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు పెట్టామని ఉద్ఘాటించారు. అత్యంత నిరాడంబర పారిశ్రామిక వేత్తగా సంపద సృష్టించిన రతన్ టాటా, తన పేరుతో టాటా ట్రస్టు పెట్టి దేశ ప్రజలకూ సేవలందించారని నొక్కిచెప్పారు. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంభించారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
రతన్ టాటా ఆలోచనలను భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఆర్టీఐహెచ్‌ను ప్రారంభించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయని వివరించారు. ఇవాళ(బుధవారం) అమరావతిలోని మయూరి టెక్ పార్కులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్టీఐహెచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, మంత్రులు నారా లోకేష్ , నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి, అమర్ రాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా జయదేవ్, తదితరులు హాజరయ్యారు. ఆర్టీఐహెచ్‌లో వివిధ స్టార్టప్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పరిశీలించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డును సీఎం చంద్రబాబుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగా ఏపీలో పనిచేయాలని నిర్ణయించుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రోఫెషనల్ విధానంలో విజయం సాధించామని వెల్లడించారు. ఏపీలో 30 నుంచి 300 ఇంజనీరింగ్ కళాశాలలను కేవలం ఎనిమిదేళ్లలో స్థాపించామని గుర్తుచేశారు. ఐటీతో కలిసి ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ ఎకానమీని సాధించాలని చెప్పుకొచ్చారు. అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశాన్ని దేవుడు తనకు ఇచ్చారని ఉద్ఘాటించారు. క్వాంటం వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయని వెల్లడించారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి అంతర్జాతీయ ప్రమాణాలు సాధించటంలో మన పరిశ్రమలు మెరుగైన ఫలితాలు సాధించాలని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనలు, ఎకో సిస్టం ఉంటేనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు సాధ్యమని ఉద్ఘాటించారు. అమరావతి ఆర్టీఐహెచ్‌కు అనుబంధంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, అనంతపురం, తిరుపతిలలో ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు.
అదే టాటాల కల్చర్..
‘రతత్‌టాటా చనిపోయాక రాజకీయ నాయకులు కంటే ఎక్కవగా ఇండస్ట్రీయలిస్టులు వచ్చారు. అయితే ఏపీ నుంచి తాను, కేంద్రమంత్రి అమిత్ షా ఆ రోజు వెళ్లాం. రతన్ టాటా నాకు చాలా బాగా తెలుసు. వాళ్లు చాలా సింపుల్‌గా ఉంటారు. అదే టాటాల కల్చర్. ఒక రోజు ఆయన నా వద్దకు వచ్చారు... ఫలక్‌నామా ప్యాలెస్‌ను నిజాం నిర్మించారు. ఈ క్రమంలో రతన్ టాటా ఫలక్ నామా ప్యాలెస్ మాదిరిగా బెస్ట్ హెరిటేజ్ హొటల్‌ను రూపొందించారు. రతన్ టాటా దేశానికి ఎంతో ఆదాయం సృష్టించారు. హైదరాబాద్‌ను వదిలి రావడానికి నేడు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. నాకు భగవంతుడు మరో అవకాశం అమరావతిని నిర్మించే అవకాశం ఇచ్చారు. 25ఏళ్లలో తెలుగు వారు అత్యధిక ఆదాయాన్ని విదేశాల్లో సంపాదించారు. డిజైన్‌లు అన్ని చేస్తున్నాం... అయితే ప్రోడక్ట్ మేకింగ్‌లో మాత్రం కొంత వెనుకబడుతున్నాం. అందరు రాజకీయ నాయకులు తమ జీవనం కోసం కూడా రాజకీయాలపై ఆధారపడతారు. అందుకే నేను హెరిటేజ్‌ను ఏర్పాటు చేశాం. రూ.5వేల కోట్ల ఇప్పుడు ఆ కంపెనీ టర్నోవర్. పదేళ్లలో 11 నుంచి నాల్గోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధగా మనం ఎదిగాం. 24 గంటల్లో లక్షా 67 వేల మంది ఈ హబ్‌లో రిజిస్టర్ అయ్యారంటే ఎంతమంది ముందుకు వస్తున్నారో చూడాలి. ఉద్యోగాలు చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలి. గతంలో ప్రతి ఇంటినుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండేలా కృషి చేశాం. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి వ్యాపారవేత్త రావాలి. రతన్‌టాటా ఆశయాలను సజీవంగా ఉంచాలన్నదే మా లక్ష్యం. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ అనేది మన లక్ష్యం. అందరినీ ఇన్నోవేషన్ హబ్‌లో ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రతన్ టాటా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పారిశ్రామికవేత్త: మంత్రి నారా లోకేష్
రతన్ టాటా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పారిశ్రామికవేత్త అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజకీయ నేతలకు ఇన్నోవేషన్‌కు సంబంధం ఏమిటని అందరూ ఆలోచిస్తారని అన్నారు. రాజకీయాల కంటే ముందు చంద్రబాబు ఓ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త అని ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు మూడు కంపెనీలను ప్రారంభించారని.. అందులో విఫలం అయ్యారని గుర్తుచేశారు. చిత్తూరు జిల్లాలో పాల ఉత్పత్తిదారుల కోసం హెరిటేజ్ ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడు మంచి టర్నోవర్‌తో వివిధ రాష్ట్రాల్లో హెరిటేజ్ పనిచేస్తోందని వివరించారు. గతంలో హైదరాబాద్ నిర్మించిన చంద్రబాబుకు ఇప్పుడు అమరావతి నిర్మించే అవకాశం వచ్చిందని ఉద్ఘాటించారు. గత ఐదేళ్ల బ్యాడ్ గవర్నెన్స్ హ్యాంగోవర్ నుంచి బయటకు వచ్చామని తెలిపారు. సీఎం చంద్రబాబు దార్శనికతతో ఆర్టీఐహెచ్‌ను ప్రారంభించారని వెల్లడించారు. త్వరలోనే ఏపీ యావత్ దేశానికి ఇన్నోవేషన్ హబ్‌గా మారుతుందని నొక్కిచెప్పారు. ఏపీలో ఇన్నోవేషన్, బిజినెస్ స్టార్టప్‌ల కోసం రికార్డు స్థాయిలో 1,67,321 రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. 24 గంటల్లో ఈ స్థాయి రిజిస్ట్రేషన్లు జరగటంపై ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
స్టార్టప్‌లకు ఎన్నో అవకాశాలు: టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
స్టార్టప్‌లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఇన్నోవేషన్ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, డిఫెన్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో పరిష్కారాలకు అవకాశాలు ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇన్నోవేషన్ హబ్‌ల ద్వారా స్థానిక, ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పలు అంశాలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఎన్నో ఆలోచనల సమాహారంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మారుతుందని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు తన దార్శనికతతో కొద్దిసమయంలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూపం ఇచ్చారని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్..
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News