Share News

Tirumala Tirupati: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్..

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:31 PM

ఆగస్టు 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేయబడతాయని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

Tirumala Tirupati: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్..
Tirupati

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన దర్శన టిక్కెట్లు, సేవా కోటాలు, వసతి బుకింగ్‌ల ఆన్‌లైన్ తేదీలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే టీటీడీ షెడ్యూల్ ప్రకారం.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా ఆగస్టు 18న వెబ్‌సైట్ ద్వారా విడుదల చేశారు. విజయవంతమైన దరఖాస్తుదారులు ఆగస్టు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులను పూర్తి చేయాలని టీటీడీ పేర్కొంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవా టిక్కెట్లు ఇవాళ(ఆగస్టు 21) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, అనుబంధ దర్శన స్లాట్‌ల కోటా విడుదల చేయబడుతుందని వెల్లడించింది.


కాగా, ఆగస్టు 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేయబడతాయని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ రూ.300 కోటా ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు విడుదల అవుతుందని స్పష్టం చేసింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి కోటా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని వివరించింది. భక్తులు తమ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే అర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు, వసతిని బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.


అయితే నిన్నటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని టీటీడీ అధికారులు తెలుపుతున్నారు. ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో వేచి భక్తులు ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. రూ. 300 శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందన్నారు. నిన్న స్వామివారిని 75,688 మంది భక్తులు దర్శించుకున్నారని స్పష్టం చేశారు. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,099గా చెప్పారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.45 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Updated Date - Aug 21 , 2025 | 08:53 AM