Home » Vinayaka Chavithi
వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. దోమల్‌గుడకు చెందిన మండప నిర్వాహకులు వినాయ కుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్ నగర్‌లో కేబుల్ వైరుకు తగిలి కింద పడిపోయింది.
ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది.
మరో నాలుగురోజుల్లో వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలు జరగనున్నాయి. ఏకదంతుడిని ప్రతిష్ఠించేందుకు ఎన్నెన్నో రూపాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. రాష్ట్రంలో ఈ ఏడాది పీఓపీ గణపతులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు.
కోరిన కోర్కెలు తీర్చి సకల విఘ్నాలు తొలగించే వినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి గ్రామంలో శ్రీసిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. కృతయుగంలో దక్షప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు ముందుగా అయినవిల్లి గణపతినే కొలిచాడని ప్రతీతి. ఈ స్వామిని స్వయంభువుగా చెబుతారు.
మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు.
ఏటా ఒక్కో విశిష్ట రూపం... 11 రోజుల్లో 25 లక్షల మంది భక్తుల సందర్శనం... 71 సంవత్సరాలుగా కొనసాగుతున్న మహోత్సవం... భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఖైరతాబాద్ గణేశుని ప్రత్యేకతలు అనేకం. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా దర్శనమిస్తున్న ఆ స్వామి విశేషాల మాలిక...
శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో
వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది ఉంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి.
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల గండస్థలమ్