Free Electricity to Ganesh Stages: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:36 PM
వినాయక చవితి సందర్భంగా భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది.
అమరావతి, ఆగస్టు 25, (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు (Ganesh Mandapam) ఉచిత విద్యుత్ (Free Electricity) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్‌కు (Nara Lokesh) విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 15వేల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించడానికి రూ.25 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ భారం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంది.
ఏపీలోని కోట్లాది మంది గణేష్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ వినతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే విజయదశమి (Vijayadashami) ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల నిర్లక్ష్యం.. అనంతబాబు కేసుతో తలనొప్పి
ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!
For More AP News And Telugu News