Share News

లంబోదరుడి ప్రార్థన ఇలా...

ABN , Publish Date - Aug 24 , 2025 | 08:14 AM

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల గండస్థలమ్‌

లంబోదరుడి ప్రార్థన ఇలా...

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే

ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం

ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల గండస్థలమ్‌

దంతాఘాత విదారితాం రుధిరై సింధూర శోభాకరం

వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదమ్‌ కామదమ్‌


శ్రీ గణేశ పంచరత్నమాల

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం

కళాధరావతంసకం విలాస లోక రక్షకం

అనాయ కైకనాయకం వినాశి తేభ దైతకం

నతాశుభాశు నాయకం నమామి తం వినాయకం

నతేతరాతి భీకరం నవోది తార్క భాస్వరం

నమత్సురారి నిర్ఘరం నతాధి కాప దుర్థరం

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం త మాశ్రయే పరాత్పరం నిరంతరం

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం

దరేత రోదరం వరం వరేభ వక్త్ర మక్షరం


book...jpg

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్‌

అకించ నార్తి మార్జనం చిరంత నోక్తి భాజనం

పూరారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం

ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం

కపోల దానవారిణం భజే పురాణ వారణమ్‌

నితాంత కాంతదంతకాంతి మంతకాంత కాత్మజం


అచింత్యరూప మంతహీన మంతరాయ కృంతనం

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం

త మేకదంత మేకమేవ చింతయామి సంతతమ్‌

మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం

ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్‌ గణేశ్వరం

అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్‌


నీకు మ్రొక్కెదన్‌

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్‌

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడు పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్‌ !!

తలచెదనే గణనాధుని, తలచెదనే విఘ్నపతిని, దలచిన పనిగా

దలచెదనే హేరంబుని, దలచెద నా విఘ్నములవి తొలగుట కొరకున్‌ !!

అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రాలు చెరకురసంబున్‌

నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతుమదిన్‌ !!

Updated Date - Aug 24 , 2025 | 08:14 AM