Share News

Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 08:47 AM

ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.

Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions in Hyderabad

హైదరాబాద్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వినాయక చవితికి ఖైరతాబాద్‌ గణేషుడు (Khairatabad Bada Ganesh) విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ముస్తాబయ్యారు. స్వామి వారికి చవితి పండుగ రోజున తొలి పూజలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిర్వహించనున్నారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సైతం పూజలకు హాజరుకానున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఖైరతాబాద్‌ గణేషుడును చూడటానికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. వాహనదారులు గమనించాలని సూచించారు.


ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. భక్తుల రద్దీని బట్టి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు.


ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బడా గణేశ్ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మీనార్ వైపు మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ ద్వారా ఐమాక్స్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సెక్రటేరియెట్ టెంపుల్ ఎక్స్ రోడ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ పోస్టాఫీసు లైన్ గుండా రైల్వే గేట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ వెల్లడించారు.


పార్కింగ్ స్థలాలు

నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చేవారు రేస్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, హెచ్ఎండీఏ పార్కింగ్ (ఐమాక్స్ పక్కన), ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణంలో పార్కింగ్ చేసుకోవచ్చని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ సూచించారు. ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వారు విశ్వేశ్వరయ్య భవన్ వద్ద వాహనాలు పార్క్ చేయాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఏం జరిగిందంటే..

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కూతుళ్ల మృతి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2025 | 09:01 AM