Gold Trader Cheated in Filmnagar: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Aug 26 , 2025 | 08:20 AM
ఫిలింనగర్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కుదువ పెట్టిన నగలతో ఉండాయించాడు సదరు వ్యాపారి మాణిక్ చౌదరి. ఫిలింనగర్‌లో మాణిక్ జ్యూవెలరీస్ పేరుతో నగల అమ్మకాలు, కుదువ వ్యాపారాన్ని మాణిక్ చేస్తున్నాడు.
హైదరాబాద్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): ఫిలింనగర్‌లో (Filmnagar) ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కుదువ పెట్టిన నగలతో ఉండాయించాడు సదరు వ్యాపారి మాణిక్ చౌదరి (Manik Chaudhary). ఫిలింనగర్‌లో మాణిక్ జ్యూవెలరీస్ పేరుతో నగల అమ్మకాలు, కుదువ వ్యాపారాన్ని మాణిక్ చేస్తున్నాడు. వ్యాపారి దగ్గర నగలు కుదువ పెట్టారు స్థానికులు. వారం రోజులుగా మాణిక్ చౌదరి షాప్ తెరవకపోవంతో బాధితులకు అనుమానం వచ్చింది.
ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో.. బంగారంతో పారిపోయాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. మాణిక్ చౌదరిపై నాలుగు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చీటీలు, అప్పుల పేరుతో పలువురి నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు మాణిక్ చౌదరి.
అలాగే వడ్డీలు ఇస్తానంటూ స్నేహితులు , స్థానికుల వద్ద కోట్లాది రూపాయలను సదరు వ్యాపారి వసూలు చేసినట్లు సమాచారం. మాణిక్ చౌదరి రూ.10 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఫిలింనగర్ పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు. మాణిక్ చౌదరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మాణిక్ గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే తమకు తెలియజేయాలని ఫిలింనగర్ పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కూతుళ్ల మృతి
Read latest Telangana News And Telugu News