Tragic Road Accident: చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కూతుళ్ల మృతి
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:27 AM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...
చేవెళ్ల, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో బైకుపై వెళ్తున్న తండ్రీకూతుర్లు లారీ చక్రల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన రైతు తాండ్ర రవీందర్ (32) మొయినాబాద్ మండలంలోని తొల్‌కట్ట గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న తన కూతురు తాండ్ర కృప (13)ను పాఠశాల నుంచి తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News