CM Chandrababu Instructions to Officials: ఎరువులపై అలర్ట్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:56 PM
ఎరువుల లభ్యత, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆరా తీశారు.
అమరావతి, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): ఎరువుల లభ్యత, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలన్న మార్గనిర్దేశం చేశారు యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని సూచించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎరువుల ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఎంత మేర ఎరువుల సరఫరా జరుగుతుందనే విషయాన్ని వివరాలతో అధికారులు వివరించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్‌ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. యూరియా సరఫరా విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అనంతపురంలో ఉద్రిక్తం
రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది
For More AP News And Telugu News