Nadendla Manohar: విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:40 PM
విశాఖపట్నం వేదికగా సేనతో సేనాని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందన్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 24: కూటమి ప్రభుత్వంపై సొషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని జనసేన పార్టీ కేడర్‌కు ఆ పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం వేదికగా సేనతో సేనాని పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు.. అంటే మూడు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారన్నారు. ఆదివారం విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం పోస్టర్‌ను ఆ పార్టీ నేతలతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.
అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. తొలి రోజు.. అంటే 28 న జనసేన లేజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆగస్ట్ 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా చర్చ ఉంటుందని వివరించారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా.. పర్యావరణం, మహిళా బాధ్యత, రక్షిత మంచినీటి పధకం, ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చలుంటాయన్నారు.
ఏడాది నుంచి అందించిన సుపరిపాలన మీద సైతం చర్చిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ పాలనలో పార్టీ శ్రేణులతో గడిపే సమయం లేకపోవడంతో ఈ కార్యక్రమంతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ కలిసి ఉంటారన్నారు. ఇక ఆగస్టు 30వ తేదీన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో.. జనసేన మహా సభ మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమౌతుందని తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6.00 గంటలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిని బాధ్యతతో ముందుకు తీసుకుని వెళ్లాలని జనసేన పార్టీ ఆలోచిస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అనంతపురంలో ఉద్రిక్తం
రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది
For More AP News And Telugu News