Share News

Video Viral: రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:37 PM

ఓట్ చోర్ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. దీంతో ఆయనతోపాటు రాహుల్ భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Video Viral: రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

పాట్నా, ఆక్టోబర్ 24: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ యాత్రలో కీలక ఘటన చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీకి ఒక యవకుడు ఆకస్మాత్తుగా వచ్చి ముద్దు పెట్టాడు. ఈ ఉహించని పరిణామంతో.. రాహుల్ గాంధీతోపాటు ఆయన భద్రత సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని.. ఆ ముద్దు పెట్టిన వ్యక్తిని గట్టిగా పక్కకు లాగి.. రెండు కొట్టారు. అయితే యువకుడు ముద్దు పెట్టినా.. రాహుల్ గాంధీ మాత్రం తన బైక్‌ను ఆపకుండా ముందుకు సాగిపోయారు.

ఈ ఘటన ఆదివారం పుర్ణియా జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓట్ చోర్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బిహార్‌లో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆ క్రమంలో ఈ యాత్రకు విధుల్లో భాగంగా భద్రత కల్పిస్తున్న పోలీసులతోపాటు ప్రజలు సైతం తీవ్రంగా గాయపడుతున్నారు.


ఆగస్టు 16వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర.. సెప్టెంబర్ 1వ తేదీన పాట్నాలో ముగియనుంది. బిహార్ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలో లక్షలాది ఓట్లు గల్లంతు కావడమే కాకుండా.. భారీగా నకిలీ ఓట్లు.. ఓటర్ల జాబితాలో వచ్చి చేరాయంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సైతం స్పందించింది. మీరు చేసిన ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వాలని.. లేకుంటే క్షమాపణలు చెప్పాలంటూ రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అనంతపురంలో ఉద్రిక్తం

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 12:43 PM