కోనసీమ జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:23 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రావులపాలెం శివారు కొత్త కాలనీలో భార్యాభర్తలు కర్రి దుర్గాలక్ష్మి, భర్త కర్రి నాగేశ్వరరెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రావులపాలెం శివారు కొత్త కాలనీలో భార్యాభర్తలు కర్రి దుర్గాలక్ష్మి(42), భర్త కర్రి నాగేశ్వరరెడ్డి(49)లు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామంలో కొంతకాలంగా ఈ దంపతులు చీటి పాటలు నిర్వహిస్తున్నారు. వీరు తనకు రూ.15 లక్షలు బాకీ ఇవ్వటం లేదంటూ కొప్పిశెట్టి నాగ మల్లేశ్వరి అనే మహిళ గత ఆగస్టు 31వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఆరోపణలతో దంపతులు కర్రి దుర్గాలక్ష్మి, భర్త కర్రి నాగేశ్వరరెడ్డి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ మహిళకు తాము రూ.కోటి అప్పు ఇచ్చామని తిరిగి చెల్లించడం లేదనే కారణంతో తాము ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సూసైడ్ నోట్‌లో దంపతులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా గురువు చేతిలో నేనూ దెబ్బలు తిన్నాను: సీఎం చంద్రబాబు
నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను: మంత్రి లోకేశ్
గోదావరి కాలుష్యానికి కారణమైన ఏపీ పేపర్ మిల్‌పై ఉద్యమిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News