Share News

పిడుగుపాటుకు గురై రైతు మృతి.. పవన్ కల్యాణ్ విచారం

ABN , Publish Date - Sep 06 , 2026 | 09:25 PM

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని యు.కొత్తపల్లి మండలం, పాత ఇసుకపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతిచెందడం విచారకరమని పేర్కొన్నారు.

పిడుగుపాటుకు గురై రైతు మృతి.. పవన్ కల్యాణ్ విచారం
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని యు.కొత్తపల్లి మండలం, పాత ఇసుకపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్పందించారు. పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతిచెందడం విచారకరమని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం నుంచి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు.


గాయపడిన కుమారుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని పవన్ కల్యాణ్ సూచించారు. నూకరాజు కుటుంబ సభ్యులక ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో పొలం పనుల్లో ఉన్న రైతులు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు తక్షణం సురక్షిత ప్రాంతాలను ఆశ్రయించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా గురువు చేతిలో నేనూ దెబ్బలు తిన్నాను: సీఎం చంద్రబాబు

నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను: మంత్రి లోకేశ్

గోదావరి కాలుష్యానికి కారణమైన ఏపీ పేపర్ మిల్‌‌పై ఉద్యమిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 09:33 PM