Share News

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:35 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2027 గోదావరి పుష్కరాలకు ఆర్ & బీ రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్ల నిధులు మంజూరు చేసింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు
Godavari Pushkaralu 2027

అమరావతి, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2027 గోదావరి పుష్కరాలకు ఆర్ & బీ రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ తక్షణం ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 6 జిల్లాల పరిధిలో 431 కిలోమీటర్ల మేర 78 రోడ్లకు మహర్దశ వచ్చిందని తెలిపారు.


గోదావరి పరిసర ప్రాంతాల్లో ఆర్ అండ్ బీ రహదారుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి వెల్లడించారు. 275 కిలోమీటర్ల మేర స్టేట్ హైవే (SH)లకు రూ.185.75 కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు. 155 కిలోమీటర్ల మేర జిల్లా ప్రధాన రహదారులు (MDR)లకు రూ.114.25 కోట్ల నిధులను విడుదల చేశామని చెప్పారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 06:32 PM