Share News

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 09:39 PM

ఏపీలో 2026-27 ఎక్సైజ్ పాలసీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 3,736 మద్యం షాపుల లైసెన్సులు అన్నింటిని ఏడాది పాటు రెన్యువల్‌ చేసింది.

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు
AP Excise Policy

అమరావతి, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): ఏపీలో 2026-27 ఎక్సైజ్ పాలసీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 3,736 మద్యం షాపుల లైసెన్సులు అన్నింటిని ఏడాది పాటు రెన్యువల్‌ చేసింది. 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు లైసెన్స్‌ను పొడిగించింది. రెన్యువల్ చేసుకోని మద్యం షాపులను లాటరీ ద్వారా కేటాయించింది. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌రిఫండబుల్ ఫీజును ఖరారు చేసింది.


ఎమ్మార్పీ ఉల్లంఘన, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్, బ్రాండ్ మిక్సింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి తప్పిదానికి రూ.10 లక్షల జరిమానా, రెండోసారి లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపింది. ప్రతి మద్యం షాపులో 4 సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా చేసింది. 24x7 పర్యవేక్షణ, ఏఐ ద్వారా ఉల్లంఘనలను గుర్తించనుంది. మద్యం విక్రయాలపై ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ట్రాక్‌ & ట్రేస్‌ తప్పనిసరి చేసింది. ఉత్పత్తి నుంచి రిటైల్ విక్రయం వరకు ప్రతి దశలో రికార్డింగ్ చేస్తున్నట్లు తెలిపింది.


మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ప్రదర్శన తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ - 14405 ఏర్పాటు చేసింది. నగదుతో పాటు డిజిటల్ పేమెంట్లను తప్పనిసరిగా స్వీకరించాలని ఆదేశించింది. వినియోగదారుడి ఎంపిక మేరకు చెల్లింపు అవకాశం కల్పించింది. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన నిఘా పెడుతున్నట్లు స్పష్టం చేసింది. తొలి తప్పిదానికి రూ.5 లక్షల జరిమానా, రెండోసారి లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొంది. అక్రమ మద్యం, కల్తీ మద్యం సమాచారంపై రివార్డు అందజేస్తామని చెప్పింది. సీజ్‌కు దారితీసే సమాచారానికి గరిష్ఠంగా రూ. లక్ష వరకు బహుమతి అందజేస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: అయ్యన్నపాత్రుడు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 09:49 PM