Share News

క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా

ABN , Publish Date - Sep 12 , 2026 | 02:23 PM

క్వాంటం బయో వ్యాలీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా స్పష్టం చేశారు. అమరావతిలో క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు చేయాలనే సీఎం చంద్రబాబు ఆలోచన బాగుందని ప్రశంసించారు.

క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా
JP Nadda

అమరావతి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): క్వాంటం బయో వ్యాలీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా (JP Nadda) స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వర్చువల్‌గా ఈరోజు (శనివారం) ప్రారంభించారు.


క్వాంటం బయో వ్యాలీపై చంద్రబాబు ఆలోచన బాగుంది..

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు ఇవ్వాలనే ముఖ్యమంత్రి సూచనకు సానుకూలంగా జేపీ నడ్డా స్పందించారు. అమరావతిలో క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు చేయాలనే సీఎం చంద్రబాబు ఆలోచన బాగుందని ప్రశంసించారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు... ఆలోచనలపై చర్చించేందుకు... కేంద్రం నుంచి ఓ సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామని పేర్కొన్నారు.


సంజీవని కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో అమలుపై ఆలోచిస్తాం..

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని.. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని జేపీ నడ్డా తెలిపారు. కిచెనే ఫార్మసీ - ఆహారమే ఔషధం అనే చంద్రబాబు కామెంట్లను తన ప్రసంగంలో జేపీ నడ్డా పదే పదే ప్రస్తావించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం చిత్తశుద్ధిని కొనియాడారు. నడ్డాతో కలిసి వేదికపైన ముఖ్యమంత్రి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ సేఫ్ హ్యాండ్స్‌లో ఉందని కొనియాడారు.


చంద్రబాబు పాత్ర మరువలేం..

చంద్రబాబు విజన్-నిబద్ధత కలిగిన నాయకుడని జేపీ నడ్డా ప్రశంసించారు. ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరువలేమని వ్యాఖ్యానించారు. కిచెనే ఫార్మసీ - ఆహారమే ఔషధమనే చంద్రబాబు మాటలు నూటికి నూరు శాతం నిజమని తెలిపారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇదే మూల సూత్రమని వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యానికి ఏపీ హై ప్రయార్టీ ఇస్తోందని చెప్పుకొచ్చారు. పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీ-నీవా ప్రాజెక్టులను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 03:16 PM