ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 12 , 2026 | 07:58 PM
విజయవాడలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు.. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పీఎం-అభీమ్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను ప్రారంభించారని పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. సీఎం చంద్రబాబుతో కలిసి వర్చువల్‌గా ఈరోజు (శనివారం) ప్రారంభించారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు (JP Nadda) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కృతజ్ఞతలు తెలిపారు. పీఎం-అభీమ్ (PM-ABHIM) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(X) వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు. ఏపీకి రూ.647.51 కోట్లతో 24 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 26 పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.
అత్యవసర వైద్యం, వ్యాధుల ముందస్తు గుర్తింపు కోసం నిధులు కేటాయించిన కేంద్రానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. 'అమరావతి క్వాంటం బయో వ్యాలీ'కి కేంద్రం మద్దతు ప్రకటించడంతో.. త్వరలో ఏపీకి సాంకేతిక బృందం రానుందని వెల్లడించారు. ఏపీకి చెందిన 'సంజీవని' ఆరోగ్య పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గదర్శకత్వంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆరోగ్యవంతమైన ఏపీ కోసం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు
గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News