Share News

గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు: మంత్రి ఆనం

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:21 PM

ఏపీ వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు: మంత్రి ఆనం
AP Minister Anam Ramanarayana Reddy

నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు. గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ఒకేచోట అన్ని అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. నెల్లూరులో గణేశ్ ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి ఆనం, ఎమ్మెల్యే కోటంరెడ్డి, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఈరోజు (ఆదివారం) పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు. లంబోదరుడి మండపాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని ప్రకటించారు.


ఈ నెల 18న ప్రత్యేకంగా వేదపండితులతో గంగాహారతి..

గణేశ్ ఘాట్ సమీప ఆలయాల నుంచి ప్రతిరోజూ ప్రసాదాలు అందిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నందున, కాణిపాకంలో స్వామి వారికి తాము పట్డువస్త్రాలు సమర్పిస్తామని పేర్కొన్నారు. సంస్కృతి, కళలు, కళాకారులను ప్రోత్సహించేలా తాము ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నదీహారతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినాయకచవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గణేశ్ ఘాట్‌కి వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన ప్రత్యేకంగా వేదపండితులతో గంగాహారతి నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


దేవదాయశాఖకే మంత్రి ఆనం వన్నె తెచ్చారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

MLA Kotamreddy Sridhar Reddy

గణేశ్ ఉత్సవాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంపూర్ణ సహాకారం అందిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. దేవదాయశాఖకే ఆనం వన్నె తెచ్చారని ప్రశంసించారు. ఈ శాఖ మంత్రిగా ఆనం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా గణేశ్ ఘాట్‌ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు

క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 12:58 PM