Share News

బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:06 AM

పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది.

బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్
Polavaram District Girl Pregnant Case

పోలవరం జిల్లా, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. అడ్డతీగల జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల (బాలికల) ప్రధానోపాధ్యాయురాలు డి.శాంతిమతి, హెచ్‌ఎం గ్రేడ్-II, హాస్టల్ వెల్ఫేర్ అధికారి పీ.విజయకాంతం, హెచ్‌డబ్ల్యూఓ గ్రేడ్-II, అలాగే కె. లోవమ్మలపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లుగా గిరిజన సంక్షేమ శాఖ డీ డి ఎమ్.రుక్మందయ్య వెల్లడించారు. బాలికను గర్భవతి చేసిన పాఠశాల వంటకుక్ మంగరాజుపై పొక్సో కేసు నమోదు చేసినట్లు రుక్మందయ్య పేర్కొన్నారు.


అడ్డతీగల జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల (బాలికల)లో 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నారని తెలిపారు. ఈనెల 10వ తేదీన బాలికకు కాకినాడలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ కుక్‌గా పనిచేస్తున్న కె. మంగరాజు బాలికపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. బాధిత బాలిక అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు

క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 12:36 PM