Share News

బొమ్మదేవర.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:39 PM

మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

బొమ్మదేవర.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా ఆయన పోస్టు పెట్టారు. అద్భుతమైన సంయమనం, కచ్చితత్వం, పట్టుదలతో, ధీరజ్ ఉత్కంఠభరితమైన షూట్-ఆఫ్‌లో జపాన్‌కు చెందిన జున్యా నకానిషిని ఓడించి, పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ప్రశంసించారు. తద్వారా ప్రపంచ కప్ ఫైనల్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారతీయ పురుష రికర్వ్ ఆర్చర్‌గా నిలిచారని పేర్కొన్నారు.


అతని ప్రయాణం, అంకితభావం ప్రత్యేకంగా స్ఫూర్తిదాయకమని డిప్యూటీ సీఎం కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ధీరజ్, చిన్న వయసులోనే తన ఆర్చరీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ప్రత్యేకంగా ఎగురవేస్తూ ఈ క్రీడలో శిఖరాగ్రానికి చేరుకున్నారని అభివర్ణించారు. ఇది భారత ఆర్చరీ చరిత్రలో ఒక మైలురాయని.. మన క్రీడాకారుల ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని ఉద్ఘాటించారు. బొమ్మదేవర భారత్‌కు గర్వకారణంగా నిలిచారని తెలిపారు భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


భారత మహిళల క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

డీపీ వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా ఆయన పోస్టు పెట్టారు. నైపుణ్యం, సంయమనం, పట్టుదలకు ఇది ఒక చక్కటి ప్రదర్శన అని వ్యాఖ్యానించారు. ఈ విజయం భారత క్రికెట్‌కు మరో గర్వకారణమని పేర్కొన్నారు. భారత మహిళలకు ఓ అద్భుతమైన ఘనత అని పవన్ కల్యాణ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘నేతన్న సేవ’ కింద ఒక్కో నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం: మంత్రి జనార్దన్ రెడ్డి

గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు: మంత్రి ఆనం

బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 01:35 PM