Share News

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు

ABN , Publish Date - Sep 15 , 2026 | 07:54 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు
AP Government

అమరావతి, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) రాష్ట్ర నిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ జీఓ జారీ చేశారు. అలాగే, సాధారణ పరిపాలన శాఖ జీఓ ఎంఎస్ నంబర్ - 187ను (G.O.Ms.No. 187) విడుదల చేసింది. నాన్-యూనిఫామ్ సర్వీస్ పోస్టులన్నింటికీ వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని సాయిప్రసాద్ స్పష్టం చేశారు.


ఈ సడలింపు సెప్టెంబర్ 30, 2027 వరకు అమల్లో ఉంటుందని సాయిప్రసాద్ తెలిపారు. ఏపీపీఎస్సీ, ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా జరిగే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పారు. గతంలో ఉన్న 42 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తుది నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్ట్ వంటి యూనిఫామ్ సర్వీసుల పోస్టులకు ఈ పెంపు వర్తించదని తేల్చిచెప్పారు. రూల్ నంబర్ - 12 ప్రకారం కల్పించే ఇతర అదనపు వయో పరిమితి సడలింపులు యథావిధిగా వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 09:19 AM