Share News

మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో అయ్యన్నపాత్రుడు భేటీ

ABN , Publish Date - Sep 15 , 2026 | 08:44 AM

దక్షిణాఫ్రికాలోని చరిత్రాత్మక ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం సందర్శించారు. సత్యాగ్రహం జన్మస్థాన సందర్శన ఒక పవిత్ర యాత్ర అని వ్యాఖ్యానించారు.

మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో అయ్యన్నపాత్రుడు భేటీ
AP Assembly Speaker Chintakayala Ayyanna Patrudu

అమరావతి, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): దక్షిణాఫ్రికాలోని చరిత్రాత్మక ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker Chintakayala Ayyanna Patrudu) ఈరోజు (మంగళవారం) సందర్శించారు. సత్యాగ్రహం జన్మస్థాన సందర్శన ఒక పవిత్ర యాత్ర అని వ్యాఖ్యానించారు. సర్వోదయ హౌస్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించినట్లు పేర్కొన్నారు.


గాంధీ మునిమనవడితో భారత్ - దక్షిణాఫ్రికా సంబంధాలపై చర్చ

సత్యాగ్రహం పుట్టిన పవిత్ర భూమిని సందర్శించడం ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. గాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో భేటీ అయ్యానని, భారత్ - దక్షిణాఫ్రికా సంస్కృతిక సంబంధాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. రామ్ గోబిన్‌ను కలంకారీ శాలువాతో సత్కరించి ఏటికొప్పాక హస్తకళాకృతిని బహూకరించారించినట్లు తెలిపారు. విలువల ఆధారిత విద్యను అందిస్తున్న కస్తూర్బా పాఠశాల యాజమాన్యాన్ని, గాంధీ కుటుంబ కృషిని అయ్యన్నపాత్రుడు కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 08:58 AM