పాకిస్థాన్‌పై డబ్బుల వర్షం కురిపిస్తున్న గాడిదలు.. ఎలాగంటే?
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:36 AM
‘ఎందుకూ పనికిరాని గాడిద’ అనే తిట్టుకు ఇప్పుడు కాలం చెల్లింది. ఎందుకంటే ఆ గాడిదలే ఓ దేశానికి ఆర్థిక వనరుగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని గాడిదలు ఇప్పుడు ఆ దేశంపై డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి. మిత్ర దేశం చైనాకు గాడిదల మాంసం, చర్మం ఎగుమతి చేస్తూ పాక్ కోట్లు గడిస్తోంది. ఇందుకోసం బలూచిస్థాన్ సమీపంలోని గ్వాదర్‌లో భారీ స్లాటర్ హౌజ్(జంతువులను వధించి, మాంసం పంపిణీ చేసే కేంద్రం)ను పాకిస్థాన్ ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ వందలాది గాడిదలను వధించి, వాటి మాంసం, చర్మాలను చైనాకు పంపిస్తోంది.
చైనాలో గాడిద మాంసానికి, దాని చర్మానికి చాలా డిమాండ్ ఉంది. అక్కడ కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు గాడిద మాంసాన్ని ఇష్టంగా తింటారు. అలాగే దాని చర్మం నుంచి తీసిన ‘ఇజియావో’ అనే పదార్థంతో ప్రత్యేక ఔషాధాలు తయారు చేస్తారు. దీన్ని రోగనిరోధక శక్తిని పెంచడానికి వినియోగిస్తారు. అలాగే నిద్రలేమి చికిత్సకూ ఇది ఉపయోగపడుతుంది. సౌందర్య సాధనాల తయారీలో కూడా ‘ఇజియావో’ వాడుతారు. దీంతో గాడిదలను చైనా ప్రజలు విపరీతంగా వధించడం మొదలుపెట్టారు. ఫలితంగా వాటి జనాభా తగ్గిపోయింది. అందుకే గాడిదలను చైనా పొరుగు దేశాలను నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది.
పేద దేశంగా ఉన్న పాకిస్థాన్‌కు ఇది కలిసివచ్చింది. పాక్‌లో మతవిశ్వాసాల కారణంగా గాడిద మాంసం తినరు. దీనివల్ల అక్కడ గాడిదల సంఖ్య క్రమంగా పెరిగి 6 మిలియన్లకు చేరుకుంది. ఈ గాడిదలను వధించి పాకిస్థాన్ చైనాకు ఎగుమతి చేస్తూ ఆర్థికంగా బలపడుతోంది. బలూచిస్థాన్‌లో ఏర్పాటు చేసిన స్లాటర్ హౌస్‌ను ప్రస్తుతం చైనా కంపెనీయే నిర్వహిస్తోంది. ఆ కంపెనీ చీఫ్ ఆండీ లియావో మాట్లాడుతూ.. ఈ గాడిదల వ్యాపారం త్వరలో నెలకు రూ.47 కోట్లు సంపాదించిపెడుతుందని, మరో రెండేళ్లలో నెలకు రూ.67 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుతుందని అంచనా వేశారు.
ఈ వార్తలనూ చదవండి:
బ్యూటీ పార్లర్‌లో రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన బామ్మ.. బిల్లు చూసి కంగుతిన్న కుటుంబం
వేల కోట్ల ఆస్తి.. కానీ భిక్షాటన చేసిన ఎమ్మెల్యే..