Share News

పదేళ్లుగా అవే.. మారని వీవో కమిటీలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:03 AM

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమ ల్లోకి తెచ్చాయి. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.

పదేళ్లుగా అవే.. మారని వీవో కమిటీలు
Bhupalpally Women Committees

  • గ్రామైక్య సంఘాల ఇష్టారాజ్యం

  • దశాబ్దకాలంగా ఒకరిదే ఆధిపత్యం

  • గాడితప్పుతున్న మహిళా సాధికారత

భూపాలపల్లి: మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమ ల్లోకి తెచ్చాయి. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా స్వావలంబన సాధించేలా కృషి చేస్తున్నాయి. జిల్లా నుంచి గ్రామీణ స్థాయిల వరకు మహిళలు సంఘాలను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా రాణించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే.. స్వయం సహాయక సంఘాలను పర్యవేక్షిస్తూ మహిళలను సాధికారత వైపు నడిపించేందుకు ఏర్పాటైన గ్రామైక్య సంఘాల (వీవో) నిర్వహణ అస్తవస్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. పలు వీవోల నిర్వహణలో ఏకచక్రధాపత్యంతోపాటు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలుఉన్నాయి. జిల్లా సమాఖ్య లోనూ ఇదే పరిస్థితి నెలకొందని పలు మహిళా సంఘాలు అంటున్నారు.


నిబంధనలకు నీళ్లు

నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి వీవో కమిటీలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉండగా అధికారుల ఉదాసీనతతో దశా బ్దకాలంగా ఒకే పీఠంపై కొందరు తిష్టవేసి ఉన్నారనే ఆరోపణ లు వస్తున్నాయి. జిల్లాలోని వీవో కమిటీలు మారడం లేదని, దీనిపై ప్రశ్నించే స్వయం సహాయక సంఘాల సభ్యుల గొంతు నొక్కుస్తున్నారని పలువురు విమర్శి స్తున్నారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా, వీటిలో 364 వీవో సంఘాలు ఉన్నాయి. ఒక్క భూపాలపల్లి పట్టణంలోనే 32 సంఘాలు కొనసాగుతున్నాయి. అయితే.. జిల్లాలోని 12 మండలాల కమిటీలు ఏర్పాటు పూర్తయితే, ఆ మండలాల అధ్యక్షులే జిల్లా అధ్యక్షురాలిని ఏకగ్రీవంగా లేదా ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు.


వీవో సంఘాల ఎన్నికలను సంవత్సరానికోసారి లేదా రెండు మూడేళ్లకోసారి కూడా నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే.. మెజారిటీ సంఘాలు నూతనంగా ఎన్నికైతే అనివార్యంగా మండల కమిటీలు, జిల్లా కమి టీలు మారుతాయని తెలిపారు. కానీ, జిల్లాలో అలా జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నూతన పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో ఆ పరిస్థితి కనిపించ డం లేదు.


hnk2.jpgఒక టర్మ్‌లో అధ్యక్షురాలిగా ఉన్నవారే మరుసటి టర్మ్‌లో కార్యదర్శిగా, ఆ తర్వాతి టర్మ్‌లో మళ్లీ అధ్యక్షురాలిగా కుర్చీలు మార్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఐదు టర్మ్‌ల (10ఏళ్లు) పాటు అధికారాన్ని చెలాయిస్తున్నారని తెలుస్తోంది. కాటారం, మహాముత్తారం మండలాల్లోనైతే ఏకం గా పదేళ్ల నుంచి ఒక్కరే కొనసాగుతున్నారనే విమర్శలు వస్తు న్నాయి. నూతన కమిటీలను ఎన్నుకోవాలని సర్వసభ్య సమావే శాల్లో తీర్మానాలు చేసినప్పటికీ, అధికారులు ఆ పత్రాలను బు ట్టదాఖలు చేస్తున్నారని సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు.


ప్రశ్నించే వారిపై దాడులు

ఈ అక్రమాలను ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, కమిటీల నుంచి తొలగిస్తున్నారని పలువురు స భ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల గణపురం మండలంలో వీవో సంఘం నాయకురాలి అక్రమాలను నిలదీసినందుకు ఒక కమిటీ సభ్యురాలిపై చెప్పుతో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై జిల్లా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (డీఆర్‌డీఏ పీడీ)కి బాధితులు ఫిర్యాదు చేసి నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.


కిందిస్థాయి సీసీల నుంచి పైస్థాయి అధికారుల వరకు లాలూచీ పడటం వల్లే ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, రెండేళ్లకు పైబడి పదవుల్లో కొనసాగుతున్న వీవో కమిటీలను రద్దు చే యాలని అంటున్నారు. వెంటనే మహాసభలు నిర్వహించి పాలకవర్గాలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో లిఫ్ట్ గుంతలో పడి పెయింటర్ మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 11:03 AM