Share News

సొంత పార్టీ నేతలపై తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 09:19 AM

వైసీపీ నేతలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌లు ఉండవని, కామాలు మాత్రమే ఉంటాయని తెలిపారు.

సొంత పార్టీ నేతలపై తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi Nag

శ్రీకాకుళం, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ (Chiranjeevi Nag) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌లు ఉండవని, కామాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. తమ్మినేనిపై మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ చేసిన వ్యాఖ్యలు జిల్లా పార్టీ అధ్యక్షుడు కనీసం ఖండించకపోవడం అమానుషమని పేర్కొన్నారు. గతంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ధర్మాన నుంచి కిరణ్‌ను కాపాడింది సీతారం కాదా. ! అని ప్రశ్నించారు.


తమ్మినేని, కూన రవికుమార్ మధ్య రాజకీయ ఒప్పందం ఉందంటూ వైసీపీ నేతలే వ్యాఖ్యలు చేయటం ఏంటి..? అని చిరంజీవి నాగ్ నిలదీశారు. ఈ అంశంపై వైసీపీ జిల్లా కీలక నేతలు ధర్మాన సోదరులు, కుంభ రవిబాబు, భూడి ముత్యాల నాయుడు మాట్లాడక పోవడం దారుణమని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీకాకుళం జిల్లాలో త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని చెప్పుకొచ్చారు.


సీతారాం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వివక్షత చూపలేదని చిరంజీవి నాగ్ అన్నారు. జిల్లాలో ఓకే కులం కోసం పార్టీ ముందుకు పోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. చింతాడ రవి వైసీపీ ఆమదాలవలస అభ్యర్థిగా ఉంటారో లేదోనని నేతల్లో అభద్రత ఉందని తెలిపారు. వైసీపీ అధిష్ఠానం శ్రీకాకుళం జిల్లా నాయకత్వ తీరుపై ఓ సర్వే చేయాలని చిరంజీవి నాగ్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు

మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో అయ్యన్నపాత్రుడు భేటీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 10:08 AM