హైదరాబాద్‌లో లిఫ్ట్ గుంతలో పడి పెయింటర్ మృతి
ABN , Publish Date - Sep 16 , 2026 | 09:14 AM
హైదరాబాద్ హయత్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పైనుంచి లిఫ్ట్ గుంతలో పడి పెయింటర్ చింతలపూడి వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి):హైదరాబాద్ హయత్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పైనుంచి లిఫ్ట్ గుంతలో పడి పెయింటర్ చింతలపూడి వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రగతినగర్‌లోని రాజధాని బ్యాంక్ భవనంలో ఈ ఘటన జరిగింది. తన కుమారుడితో కలిసి పెయింటింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వరరావు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి
వెయ్యి రోజుల పాలనపై సమాధానం చెప్పలేక మాపై దాడులు చేస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News