తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Sep 15 , 2026 | 10:37 AM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రజాకార్ల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, రక్తపు గుర్తులు కనిపిస్తాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) ఆరోపించారు. రజాకార్ల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, రక్తపు గుర్తులు కనిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో విముక్తి కలిగిందని చెప్పుకొచ్చారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కిషన్‌రెడ్డి మాట్లాడారు. నిజాం మెడలు వంచడంతో 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ గడ్డకు ముక్తి లభించిందని వెల్లడించారు. విమోచన చరిత్రను గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు.
ఈ రెండు పార్టీలు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు విమోచన వేడుకలు జరపడానికి ఎందుకు భయపడుతున్నాయని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏంఐఎం మోచేతి నీళ్లు తాగి ఈ రెండు పార్టీలు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 90వ దశకంలో హైదరాబాద్ ముక్తి దివస్ చేయాలని అనేక పోరాటాలు చేశామని ప్రస్తావించారు. గత ఐదేళ్ల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల సారథ్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇది రాజకీయ పరమైన అంశం కాదని .. యావత్తు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులు తాము నిర్వహించే విమోచన వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన నిర్వహించే విమోచన వేడుకలకు హైదరాబాద్, తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా రావాలని కోరారు.
అందుకోసమే విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నాం..
సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది విలీనం, విద్రోహం అనేవాళ్లకు తాము తెలంగాణ స్వాత్రంత్య్రం అంటామంటామని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం ప్రభుత్వాల విధి అని తెలిపారు. అందుకోసమే విమోచన దినోత్సవం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ మీద.. సీఎం రేవంత్‌రెడ్డి చేసే విమర్శలపై సమయం వచ్చినపుడు స్పందిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్
అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు
శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్‌ల్లోకి దూసుకెళ్లి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News