Share News

శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్‌ల్లోకి దూసుకెళ్లి..

ABN , Publish Date - Sep 14 , 2026 | 08:39 AM

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కిషన్‌గూడాలో ట్రావెల్స్ సంస్థకు సంబంధించిన బస్సు బీభత్సం సృష్టించింది. ఈ బస్సు హోటల్లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు.

శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్‌ల్లోకి దూసుకెళ్లి..
Shamshabad Bus Accident

రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కిషన్‌గూడాలో ట్రావెల్స్ సంస్థకు సంబంధించిన బస్సు బీభత్సం సృష్టించింది. ఈ బస్సు హోటల్లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందారు. మృతుడిది కరీంనగర్ వాసి అజ్మల్‌గా గుర్తించారు. హోటల్ వద్ద టీ తాగుతుండగా అజ్మల్‌ను బస్సు ఢీకొట్టింది. 50 మందికిపైగా స్వల్పగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి.


బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు తొలుత కంటైనర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కంటైనర్‌ను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్లు సమాచారం. పలు వాహనాలను ఢీకొట్టి బాలాజీ భవన్ హోటల్లోకి ఈ బస్సు దూసుకెళ్లింది. హోటల్లో బొండాలు వేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.అప్రమత్తమైన స్థానికులు.. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.


ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి పోలీసులు వైద్యం అందిస్తున్నారు. ఘటనా స్థలానికి శంషాబాద్ పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రోశయ్య దూరదృష్టితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్‌: సీఎం రేవంత్‌రెడ్డి

ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్

మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్‌రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 09:15 AM