మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్‌రావు
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:49 PM
మట్టి వినాయకుడిని పూజించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): మట్టి వినాయకుడిని పూజించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) పిలుపునిచ్చారు. సిద్దిపేట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు (ఆదివారం) అమర్నాథ్ అన్నదాత సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రతి ఏడాది 10 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం.. మంచి కార్యక్రమమని అభినందించారు. ఆనాడు పార్వతీదేవి నలుగు మట్టితోనే వినాయకుడిని తయారుచేసిందని వెల్లడించారు.
రసాయనాలతో వినాయకుడిని తయారు చేస్తే ఊరందరికీ నష్టం జరుగుతుందని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. మట్టి వినాయకుడికి పూజ చేస్తేనే ప్రకృతికి, దేవునికి ఆనందం.. ప్రజలకు ఆరోగ్యమని వ్యాఖ్యానించారు. ప్రతి ఊరికి మట్టి వినాయకుల విగ్రహాలను పెడతామని చెబితే పర్మినెంట్ షెడ్డును తాను తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తానని మాటిచ్చారు. ఈ ప్రపంచంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిమ్స్‌లో అరుదైన ఘనత.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్ హయాంలోని భూ అక్రమాలను అసెంబ్లీ ముందు ఉంచుతాం: పొంగులేటి
కేసీఆర్.. మాక్ అసెంబ్లీకి కూడా రాలేదంటే చట్టసభలపై నమ్మకం లేదా.?: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News