Share News

ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్ట్

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:17 AM

ఢీ10, 20 టీవీషో విన్నర్ రాజును మియాపూర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు ఈరోజు రికార్డ్ చేశారు.

ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్ట్
Dhee Show Winner Dancer Raju

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ఢీ10, 20 టీవీషో విన్నర్ రాజును (Dhee Show Winner Dancer Raju) మియాపూర్ పోలీసులు నిన్న(శనివారం) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పోలీసులు తరలించారు. ఓ యువతిని లైంగికంగా వేధించాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. సినిమా అవకాశాల పేరుతో మోసం చేసినట్లుగా ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఈనెల 9వ తేదీన రాజుపై కేసు నమోదు చేసి మియాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.


పెళ్లి పేరుతో తనకు దగ్గరై రూ.12 లక్షలు తీసుకొని డ్యాన్సర్ రాజు మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. యువతిని మోసం చేసి మరో సీరియల్ నటితో తిరుగుతున్నట్లుగా రాజుపై ఆరోపణలు ఉన్నాయి. అతనిపై కేసు పెట్టిన బాధితురాలిపై సీరియల్ నటి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. రాజుపై తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోషియేషన్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. సుమలత, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిమ్స్‌లో అరుదైన ఘనత.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్ హయాంలోని భూ అక్రమాలను అసెంబ్లీ ముందు ఉంచుతాం: పొంగులేటి

కేసీఆర్.. మాక్ అసెంబ్లీ‌కి కూడా రాలేదంటే చట్టసభలపై నమ్మకం లేదా.?: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 11:39 AM