Share News

అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:20 PM

మాజీ మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్, పీఆర్వో మహేశ్‌లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారణ చేస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో వీరిని విచారిస్తున్నారు.

అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు
Hyderabad Police interrogation

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్, పీఆర్వో మహేశ్‌లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారణ చేస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో వీరిని విచారిస్తున్నారు. తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను పాటిస్తూ విచారణ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ముందు జరిగిన ఘర్షణ వాతావరణoపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉద్వేష పూర్వక వ్యాఖ్యలు, దూషణలపై వారి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు.


ఈ కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 35(3) నోటీసు ఇవ్వాలని న్యాయవాదులు పట్టుబట్టారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో రెండు గంటలుగా కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్‌లను పోలీసులు విచారిస్తున్నారు. అసెంబ్లీ గేట్ నంబర్-3 దగ్గర చోటు చేసుకున్న ఆందోళనపై సిట్ అధికారుల కనుసన్నల్లో విచారణ కొనసాగుతోంది. చట్టసభల ముందు ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయిన విషయం తెలిసిందే.


కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై పోలీసుల ప్రశ్నల వర్షం

ఈ నేపథ్యంలో కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్దేశపూర్వకంగానే కుట్రలకు తెరలేపారా.?, అసెంబ్లీ ముందు ఆందోళనలపై ముందుస్తుగా తెలుసా.? అనే విషయాలపై పోలీసులు వివరాలు రాబడుతున్నారు.


పీఏ, పీఆర్వోల విచారణలో కీలక పరిణామం

కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్‌ల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ను చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఇద్దరిని అసెంబ్లీ వద్దకు సైఫాబాద్ పోలీసులు తీసుకెళ్లనున్నారు. అయితే, మొదట నోటీసులు ఇవ్వాలని న్యాయవాదులు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎదుట ఘటన ఎలా జరిగిందనే కోణంలో సీన్ కన్‌స్ట్రక్షన్ చేయాలని పోలీసులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాదనలు జరుగుతున్నాయి. తెలంగాణ హై కోర్ట్ ఆదేశాలకు వ్యతిరేకంగా పోలీసుల విచారణ జరుగుతుందని న్యాయవాదుల ఆరోపించారు. అయితే, సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం అసెంబ్లీ వరకు నడుచుకుంటూ వస్తామని పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్ చెబుతున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

రోశయ్య దూరదృష్టితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్‌: సీఎం రేవంత్‌రెడ్డి

ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్

మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్‌రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 02:04 PM