Share News

యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Sep 16 , 2026 | 09:25 AM

ఆసియా క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న 'జ్యోతి యర్రాజీ'కి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(X)లో మంత్రి పోస్టు పెట్టారు.

యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): ఆసియా క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న 'జ్యోతి యర్రాజీ'కి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(X)లో మంత్రి పోస్టు పెట్టారు. ఎంతోమంది యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని అభినందించారు.


ఈ నెల 25, 26వ తేదీల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ బరిలోకి దిగుతున్నారని ప్రశంసించారు. ఆమె వేగంగా పరుగెత్తి భారత్‌కు ఘనత తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఏపీ మొత్తం జ్యోతి యర్రాజీకి అండగా నిలుస్తోందని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు

మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో అయ్యన్నపాత్రుడు భేటీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 10:29 AM