గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Sep 16 , 2026 | 08:44 PM
ప్రభుత్వ పనులంటే కాళ్లు అరిగేలా తిరగాలి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గరికెళ్లి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోగానే రోజులు, గంటల వ్యవధిలోనే పరిష్కరించేస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలకు గల నమ్మకాన్ని, గౌరవాన్ని రెట్టింపు చేస్తున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 16: ప్రభుత్వ పనులంటే కాళ్లు అరిగేలా తిరగాలి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గరికెళ్లి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోగానే రోజులు, గంటల వ్యవధిలోనే పరిష్కరించేస్తున్నారు.
నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గం, గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు తమ స్కూలుకు వెళ్లే రోడ్డు సరిగాలేదని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయగా.. పవన్ స్పందించారు. తక్షణమే ఆ గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రపంచ కప్ గెలిచిన అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ టి.సి. దీపిక తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరగా.. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దీపిక తన ఇంటికి చేరేలోపే.. పవన్ కల్యాణ్ రోడ్డు మంజూరు చేయడంతో పాటు, అధికారులు రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేశారు.
కానిస్టేబుల్ బాబురావు తన గ్రామానికి రోడ్డు కావాలని ఓ వేదిక మీద ఉపముఖ్యమంత్రిని కోరగా.. వేదిక దిగే లూపే పవన్ ఆ గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవే కాకుండా.. గ్రామాల్లో రోడ్ల ఏర్పాటుకు చేసిన తీర్మానాలకు కూడా స్పందించి.. రోడ్లను మంజూరు చేశారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. కాగా.. ఉపముఖ్యమంత్రి పవన్ మంజూరు చేసిన రోడ్లలో చాలా రోడ్లు దాదాపు వెయ్యి కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నవే.
Also Read:
9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు
కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్