కొందరు నేతలు దేశాన్ని చులకన చేయడం సరికాదు: వెంకయ్య నాయుడు
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:24 PM
పల్లెటూరిలో పుట్టినప్పటికీ.. పదవులు వాటంతటవే తనను వెతుక్కుంటూ వచ్చాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చదువురాని కుటుంబంలో జన్మించినా దేశ స్థాయిలో అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పదవులు చేపట్టగలిగానని చెప్పారు.
నెల్లూరు, సెప్టెంబర్ 9: పల్లెటూరిలో పుట్టినప్పటికీ.. పదవులు వాటంతటవే తనను వెతుక్కుంటూ వచ్చాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చదువురాని కుటుంబంలో జన్మించినా దేశ స్థాయిలో అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పదవులు చేపట్టగలిగానని చెప్పారు. ప్రధాని నరేంద్ర 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చొదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో దేశం వికసించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయంగా భారత్ అత్యంత వేగంగా ఆర్థికంగా దూసుకెళుతోందని వెల్లడించారు.
గ్రామీణ సడఖ్ రోడ్లు వాజ్‌పేయీ పుణ్యమే..
ప్రస్తుత నేతలు కొందరు దేశాన్ని చులకన చేస్తూ విమర్శలు చేయడం సరికాదని వెంకయ్య అన్నారు. పరిపాలనలో లోపాలుంటే, సమస్యలు పరిష్కారం కాకుంటే విమర్శించాలన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులు, మహిళలపై విమర్శలు మంచివి కాదని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి పదవి ఇస్తే వద్దన్నానని.. ఆర్థిక ప్రాధాన్యం లేని గ్రామీణశాఖ ఇవ్వమంటే పెద్దగా నవ్వారంటూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను కలపడం.. వరసగా శంకుస్థాపనలు, తరువాత ప్రారంభోత్సవాలు చేయడం తన అదృష్టమన్నారు. గ్రామాల్లో గ్రామీణ సడఖ్ రోడ్లు వాజ్‌పేయీ పుణ్యమే అని చెప్పుకొచ్చారు.
మోరల్ క్లాసులు నిర్వహించాలి...
‘నా జీవితంలో ఎన్నెన్నో చేసినా.. స్వర్ణ భారత్ ట్రస్ట్ అత్యధికంగా సంతృప్తిని ఇచ్చింది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనన్ని లక్షల ఇళ్లని తెలంగాణ, ఏపీకి ఇచ్చాం. కోవూరు మండలంలో రూ.4వేల కోట్లతో మిథానీ కంపెనీ వచ్చి ఉంటే.. ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయేవి. పదవిలో ఉన్నప్పుడు 35 మంది కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించాను. అందరితో చర్చించి ఏపీకి పలు ప్రాజెక్ట్‌లు వచ్చేలా చూశాను. మేము చదువుకునే సమయంలో మోరల్ క్లాసులు ఉండేవి. సమాజంలో ఐక్యత, సఖ్యత తగ్గిపోతున్నాయి. స్కూళ్లలో మానవతా విలువలు నేర్పే మోరల్ క్లాసులు నిర్వహించాలని మంత్రి లోకేశ్‌ను కోరుతున్నాను. స్కూళ్లల్లో ఖచ్చితంగా ఫోన్లు నిషేధించాలి. సోషల్ మీడియా యాంటీ సోషల్ ఎలిమెంట్‌గా మారింది. అబ్యూజ్, పెట్రే, వయిలెన్స్ ఉండకూడదు. చట్టసభల్లో గౌరవంగా మెలగాలి. రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 12 మందిని సస్పెండ్ చేశాను. దేశంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోతున్నాయి. కొందరు తల్లిదండ్రులు భోజనాల సమయంలోనూ పిల్లలకి ఫోన్లు ఇవ్వడం దురదృష్టకరం. 25 దేశాల్లో ఫోన్ వాడకంపై పలు ఆంక్షలు పెట్టాయి’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎండైనా వానైనా.. హైదరాబాద్ హైరానా
చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. ‘నిజం గెలిచింది’ అంటూ లోకేశ్ పోస్ట్
Read Latest AP News And Telugu News