Share News

సభలో లేని వారినీ సస్పెండ్ చేయడం హాస్యాస్పదం: తలసాని శ్రీనివాస్

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:40 AM

ప్రజల సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవటానికి తమను సస్పెండ్ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

సభలో లేని వారినీ సస్పెండ్ చేయడం హాస్యాస్పదం: తలసాని శ్రీనివాస్
Talasani Srinivas Yadav

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రజల సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవటానికి తమను సస్పెండ్ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఈరోజు(బుధవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తమకు భయపడి బలవంతంగా బయటకు పంపారన్నారు. శాసనసభవ్యవహారాల మంత్రి చదివిన పేర్లు కాకుండా.. స్పీకర్ వేరే పేర్లు చదివారని తెలిపారు. సభలో లేని పద్మారావు, మల్లారెడ్డి, గంగుల, గూడెం మహిపాల్ రెడ్డిని సస్పెండ్ చేయటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.


స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటే అందరకీ గౌరవమని తలసాని అన్నారు. దళిత స్పీకర్ దళిత స్పీకర్ అంటూ.. ఆయన ఇమేజ్‌ను కాంగ్రెస్ డ్యామేజ్ చేసిందని విమర్శించారు. భట్టి ముఖ్యమంత్రి అయితే సంతోష పడేది తామే అని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లా‌న్ ఏమైందో భట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేను సభలో పెట్టకుని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపారని మండిపడ్డారు. దళితులపై బీఆర్ఎస్ చిత్తశుద్ధిని శంఖించాల్సిన అవసరం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరం: భట్టి విక్రమార్క

అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 12:08 PM