Share News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరం: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:44 AM

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ‘శుద్ధి’ అంశం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర రచ్చకు దారి తీసింది. బీఆర్‌ఎస్ తీరుపై మంత్రులు మండిపడ్డారు. స్పీకర్‌ను అవమానించడం, నిరసన ప్రాంతాన్ని శుద్ధి చేయడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో మాట్లాడారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరం: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka

హైదరాబాద్, సెప్టెంబర్ 9: కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ‘శుద్ధి’ అంశం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర రచ్చకు దారి తీసింది. బీఆర్‌ఎస్ తీరుపై మంత్రులు మండిపడ్డారు. స్పీకర్‌ను అవమానించడం, నిరసన ప్రాంతాన్ని శుద్ధి చేయడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సభాపతిని అందరూ గౌరవించాలని అన్నారు. పదేళ్లు మంత్రులుగా చేసిన వారు స్పీకర్‌ను అగౌరపరిచేలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు.


బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరమని.. వారు చేసిన అవమానాలు ఇక చాలని ఉపముఖ్యమంత్రి అన్నారు. కా భరించే ఓపిక సమాజానికి లేదని తెలిపారు. దళితులు తిరిగారని రోడ్ల పై పసుపు నీళ్లు చల్లుతారా అంటూ ఫైర్ అయ్యారు. ‘మనం ఏ సమాజంలో ఉన్నాం.. మీ ఛాలెంజ్‌లకు, బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. బీఆర్‌ఎస్ సభ్యులు ఎవరిని బెదిరిస్తున్నారు. ఎంతకాలం దాడులు చేస్తారు. ఇది ఆత్మగౌరవ సమస్య. ఇంకా అవమానాలు భరించడానికి మేము సిద్ధంగా లేము. ఈ ప్రభుత్వం స్పీకర్‌కు అండగా నిలబడుతుంది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


దళితులు నడిస్తే శుద్ధి చేస్తారా.. ఏ యుగంలో బతుకుతున్నాం: శ్రీధర్ బాబు

‘మీకు ఏం కావాలో లిఖిత పూర్వకంగా ఇవ్వండి. కేసీఆర్ బాగుండాలని కోరుకుంటున్నాం. వందేళ్లకు పైగా జీవించాలి.. సమాజానికి తన సేవలు అందించాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎవరి చావు కోరుకోదు. దళితులు నడిచిన చోట బీఆర్‌ఎస్ నేతలు శుద్ధి చేశారు. మనం ఏ యుగంలో బతుకుతున్నాం. దళితులు నడిస్తే శుద్ధి చేస్తారా? ఈరోజు శాసనసభ నడవాలి.. బీఆర్‌ఎస్ సహకరించాలి. సభ నడువద్దని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుని వచ్చింది. స్పీకర్‌ను బెదిరించడం సరికాదు’ అంటూ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఎండైనా వానైనా.. హైదరాబాద్‌ హైరానా

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ‘శుద్ధి’పై అసెంబ్లీలో దుమారం.. బీఆర్ఎస్‌పై మంత్రి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 11:28 AM