Share News

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. ‘నిజం గెలిచింది’ అంటూ లోకేశ్ పోస్ట్

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:41 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి నేటి మూడేళ్లు పూర్తైయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మూడేళ్ల క్రితం చంద్రబాబును అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. ‘నిజం గెలిచింది’ అంటూ లోకేశ్ పోస్ట్
Minister Nara lokesh

అమరావతి, సెప్టెంబర్ 9: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి నేటి(బుధవారం) మూడేళ్లు పూర్తైయింది. ఈ సందర్భంగా ‘నిజం గెలిచింది’ పేరుతో పార్టీ కార్యాలయాలు, ఇళ్లు, బూత్‌ లెవ‌ల్‌‌లో దీపాలు వెలిగించాలని, ఈరోజు బ్లాక్‌ డే పాటించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు సంబంధించి సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మూడేళ్ల క్రితం చంద్రబాబును అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు.


‘గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం చంద్రబాబుని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుంచి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం ‘నిజం గెలవాలి’ అంటూ చంద్రబాబ‌ుకు మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణమిదే!

ఎండైనా వానైనా.. హైదరాబాద్‌ హైరానా

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 09:48 AM